Bajaj Pulsar N150 | స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి బజాజ్ పల్సర్ ఎన్150.. ధరెంతంటే..?!
Bajaj Pulsar N150 | కుర్రాళ్లను ఆకట్టుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో.. మార్కెట్లోకి సరికొత్త పల్సర్ ఎన్ 150 బైక్.. స్పోర్టీ లుక్ తో ఆవిష్కరించింది.
Bajaj Pulsar N150 | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో తన పల్సర్ లైన్ అప్ మోటారు సైకిళ్లను పూర్తిగా మార్చేస్తున్నది. కుర్రాళ్లకు దగ్గరయ్యేందుకు స్పోర్టీ లుక్‌తో సరికొత్త పల్సర్ బైక్ మార్కెట్లో ఆవిష్కరించింది. బజాజ్ పల్సర్ ఎన్150 (Bajaj Pulsar N150) పేరుతో వస్తున్న ఈ మోటారు సైకిల్ ధర రూ.1,17,677 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇంతకుముందు మార్కెట్లో విడుదల చేసిన పీ150 పల్సర్ మోడల్ బైక్‌కు స్పోర్టీ లుక్ తీసుకొచ్చి బజాజ్ ఎన్150 బైక్‌గా ఆవిష్కరించింది.
బజాజ్ పల్సర్ ఎన్150 మోటార్ సైకిల్ 149.68 సీసీ ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎఫ్1 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 14.30 బీహెచ్పీ విద్యుత్, 13.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న పల్సర్ ఎన్150 మోటారు సైకిల్ లీటర్ పెట్రోల్‌పై 45-50 కి.మీ మైలేజీనిస్తుందని బజాజ్ ఆటో తెలిపింది.
ఫ్రంట్ టెలిస్కోఫిక్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్స్‌తో వస్తున్న బైక్.. ముందు 240ఎంఎం డిస్క్ బ్రేక్-బ్యాక్ 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్ ఫెసిలిటీ కలిగి ఉంటుంది. కచ్చా రోడ్లపైనా సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగి ఉందీ బైక్.
కొత్త పల్సర్ ఎన్150 మోటారు సైకిల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడో మీటర్, మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం ఫ్యూయల్ ట్యాంక్‌పై యూఎస్బీ పోర్ట్ అందిస్తున్నారు. రేసింగ్ రెడ్, మెటాలిక్ పెరల్ బైట్, ఎబోనీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అగ్రెసివ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

