హైదరాబాద్, మే 13: ప్రముఖ ద్వి, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో..తాజాగా మార్కెట్లోకి మరో ఈ-ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోగో పేరుతో విడుదల చేసిన ఈ ఆటో సింగిల్ చార్జింగ్‌తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ సెగ్మెంట్లో విడుదలైన ఆటోలో ఇదే అత్యధిక మైలేజీ ఇచ్చే వాహనం ఇదేనని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సమర్దీప్ సుబాంధ్ తెలిపారు. శక్తివంతమైన ఎల్ఈడీ లైట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో హజార్డ్, యాంటీ-రోల్ డిటెక్షన్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ ఆటోలో 9 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ప్యాసింజర్ మాడల్ ధర రూ.3,26,797 గాను, 12 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర రూ.3,83,004గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.