Bajaj – Triumph | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో.. మార్కెట్లోకి రెండు కొత్త మోటారు సైకిళ్లు ఆవిష్కరించింది. గతేడాది బ్రిటిష్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్ తో కలిసి రెండు బైక్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రయంఫ్ స్పీడ్ టీ4, ట్రయంఫ్ స్పీడ్ 400 ఎంవై 25 అనే మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. ట్రయంఫ్ స్పీడ్ టీ4 మోటారు సైకిల్ ధర రూ.2.17 లక్షలు (ఎక్స్ షోరూమ్), ట్రయంఫ్ స్పీడ్ 400 ఎంవై25 రూ.2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా బజాజ్ ఆటో నిర్ణయించింది.
ట్రయంఫ్ స్పీడ్ టీ4 మోటారు సైకిల్ 400సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 7,000 ఆర్పీఎం వద్ద 30.6 బీహెచ్పీ విద్యుత్, 5,000 ఆర్పీఎం వద్ద 36 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్సుతో వస్తున్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ గరిష్టంగా 135 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, డిజిటల్ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుందీ మోటార్ బైక్.
ట్రయంఫ్ స్పీడ్400 ఎంవై25 మోటారు సైకిల్ 398సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. 8,000 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్పీ విద్యుత్, 6,500 ఆర్పీఎం వద్ద 37.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తున్న ట్రయంఫ్ స్పీడ్400 ఎంవై25 బైక్ 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. డ్యూుయల్ ఏబీఎస్ ఉంటది. జావా 42ఎఫ్ జే, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, హీరో మావ్రిక్ 440 మోడల్ మోటారు సైకిళ్లకు బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యంతో వస్తున్న ట్రయంఫ్ స్పీడ్ టీ4, ట్రయంఫ్ స్పీడ్400 ఎంవై25 మోటారు సైకిళ్లు గట్టి పోటీ ఇస్తాయి.