పుణె, మార్చి 2: బజాజ్ ఆటో.. చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడు కలర్లలో లభించనున్న ఈ ప్రీమియం ఈవీ ధర బెంగళూరు ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1,51,910. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చేతక్ ధర రూ.1,21,933గా ఉన్నది. సరికొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో తీసుకొచ్చింది.