డయాబెటిక్స్ కోసం బజాజ్ అలియంజ్ టర్మ్ ప్లాన్
టైప్ 2 డయాబెటిక్, ప్రి-డయాబెటిక్స్ కోసం బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ప్రత్యేక టర్మ్ ప్లాన్‌ను విడుదల చేసింది. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం దేశీయ బీమా పరిశ్రమలో తొలి టర్మ్ ప్లాన్ ఇదేనని సంస్థ తెలిపింది.
హైదరాబాద్ , జూన్ 10: టైప్ 2 డయాబెటిక్, ప్రి-డయాబెటిక్స్ కోసం బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ప్రత్యేక టర్మ్ ప్లాన్‌ను విడుదల చేసింది. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం దేశీయ బీమా పరిశ్రమలో తొలి టర్మ్ ప్లాన్ ఇదేనని సంస్థ తెలిపింది. హెచ్‌బీఏ1సీ (ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్, గత మూడు నెలల్లో సగటు బ్లడ్ షుగర్ స్థాయి) 8 శాతం వరకూ ఉన్న ప్రి-డయాబెటిక్ లేదా టైప్-2 డయాబెటిస్ కలిగినవారికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ఇది సమగ్ర బీమా పథకమని పేర్కొంది. హెచ్‌బీఏ1సీ స్థాయిని తగ్గించుకున్న పాలసీహోల్డర్లకు తదుపరి సంవత్సరం ప్రీమియం చెల్లింపులో 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని బజాజ్ అలియంజ్ తెలిపింది.
ప్లాన్ వివరాలు:
- 30 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులు ప్లాన్ తీసుకునేందుకు అర్హులు
- 5 నుంచి 25 ఏండ్ల వరకూ వివిధ కాలపరిమితులతో పాలసీ లభిస్తుంది
- కనీస బీమా మొత్తం రూ. 25 లక్షలుకాగా, గరిష్ఠ పరిమితి లేదు
- బీమా మొత్తానికి అనుగుణంగా ప్రీమియం ఉంటుంది.
- ప్రీమియంను ఏడాది, అర్థసంవత్సరం, త్రైమాసికం, నెలవారీ వ్యవధుల్లో చెల్లించవచ్చు.
- ఉదాహరణకు 20 ఏండ్ల కాలపరిమితితో రూ.1 కోటి బీమా మొత్తం కోసం పాలసీ తీసుకునే 35 ఏండ్ల డయాబెటిక్ (నాన్-స్మోకర్) రూ.26,838 చొప్పున వార్షిక ప్రీమియం (జీఎస్టీతో సహా) చెల్లించాల్సి ఉంటుంది.
ప్లాన్ ప్రయోజనం
పాలసీకాలంలో పాలసీదారు మరణిస్తే నామినీ లేదా వారసులకు బీమా మొత్తం అందుతుంది. ఇది పూర్తిగా టెర్మ్ ప్లాన్ అయినందున, పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారుకు బీమా సంస్థ ఎటువంటి చెల్లింపూ చేయదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

