Flipkart Axis Bank Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. వాటి వినియోగానికి అనుగుణంగా వడ్డీ, వాడకం బిల్లు పే చేయడానికి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుల వాడకాన్ని బట్టి బెనిఫిట్లు లభిస్తాయి. ఇందుకోసం ప్రైవేట్ రంగ బ్యాంకు.. యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డు వాడకం దారులకు ఇచ్చే బెనిఫిట్లలో కోత విధించింది.
ఈ కామర్స్ కొనుగోళ్లు ఎక్కువగా ‘యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్ కార్ట్’ క్రెడిట్ కార్డు వాడతారు. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల్లో అధిక ప్రయోజనాలు గల క్రెడిట్ కార్డుల్లో ఇదొకటి. ఫ్లిప్‌కార్ట్‌తో విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ తోపాటు మింత్రా కొనుగోళ్లపై క్యాష్ బ్యాంక్ ఐదు శాతం నుంచి 1.5 శాతానికి కుదించేశారు. విద్యుత్ బిల్లు, ఫ్యుయల్ కొనుగోళ్లు, వాలెట్ లోడింగ్, రెంటల్ పేమెంట్స్ మీద ఏ క్యాష్ బ్యాక్ ఉండదు. కార్డు రెన్యూవల్ ఫీజు రాయితీ పరిమితి రూ.2 లక్షల నుంచి 3.5 లక్షలకు పెంచారు. రూ.3.5 లక్షలకు పైగా ఖర్చు చేసిన వారికి మాత్రమే వార్షిక రుసుములో రూ.500 రాయితీ కల్పిస్తుంది.
యాక్సెస్ బ్యాంక్ ఫ్లిప్ కార్ట్ కో బ్రాండెడ్ కార్డుపై రాయితీల్లో కోత విధిస్తున్నట్లు తెలిపింది. వచ్చేనెల 12-14 తేదీల మధ్య కొత్త పాలసీ అమల్లోకి రానున్నదని తెలుస్తున్నది. వీటితోపాటు యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్, యాక్సిస్ బ్యాంక్ రిజర్వు, యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ తదితర క్రెడిట్ కార్డులపై వస్తున్న ప్రయోజనాలు తగ్గిపోతాయని వదంతులు వినిపిస్తున్నాయి. బెనిఫిట్ల తగ్గింపుపై ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు సమాచారం అందజేస్తున్నది.