Axis Credit Card | యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. కోబ్రాండెడ్ ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ బ్యాంక్ రూల్స్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మారిన రూల్స్ ఈ ఏడాది జూన్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు యూజర్లకు బ్యాంక్ సమాచారం అందించింది. ప్రస్తుతం కార్డ్ యూజర్లకు అందిస్తున్న లాంజ్ యాక్సెస్‌ను తొలగించింది. ఇప్పటి వరకు మింత్రా షాపింగ్‌పై ఇస్తున్న క్యాష్‌బ్యాక్‌ను పెంచింది. గతంలో మింత్రాలో కొనుగోలుపై కేవలం ఒకశాతం మాత్రమే క్యాష్‌బ్యాక్ ఉండగా.. దాన్ని 7.5శాతానికి పెంచింది. స్టేట్మెంట్ త్రైమాసికంలో గరిష్టంగా రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు చెప్పింది.
అలాగే, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లు, క్లియర్‌ట్రిప్‌లో బుకింగ్స్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. త్రైమాసికంలో గరిష్టంగా రూ.4వేల క్యాష్‌బ్యాక్ వస్తుందని చెప్పింది. స్విగ్గీ, పీవీఆర్, కల్ట్‌ఫిట్, ఉబర్ లావాదేవీలపై 4 శాతం క్యాష్‌బ్యాక్ బ్యాక్, ఇతర కొనుగోళ్లపై ఒకశాతం క్యాష్‌బ్యాక్ కొనసాగనున్నది. ఈజీ డైనర్పై 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుండగా.. రూ.400పైగా చేసే చమురు కొనుగోళ్లపై ఒకశాతం ఫ్యూయల్ సర్‌చార్జి రద్దు వర్తించనున్నది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజర్లు కొత్తగా తీసుకునేందుకు రూ.500 జాయినింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రూ.500 రెన్యువల్ ఫీజును చెల్లించాల్సిందే. ఏడాదిలో రూ.3.50లక్షల ట్రాన్సాక్షన్స్ జరిపితే రెన్యూవల్ ఫీజు మాఫీ అవుతుంది.