హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ సీడీకే..హైదరాబాద్లో ఉన్న కార్యాలయాన్ని మరింత విస్తరించింది. అదనంగా 50 వేల చదరపు విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించినట్లు సీడీకే ఇండియా ఎండీ సందీప్ కుమార్ జైన్ తెలిపారు.
అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీతో అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించడానికి ఈ సెంటర్ను వినియోగించనున్నట్లు చెప్పారు.