హైదరాబాద్, డిసెంబర్ 13: జపాన్‌కు చెందిన మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల సంస్థ ‘దైఫుకు కంపెనీ లిమిటెడ్’..రాష్ట్రంలో నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లో ప్రపంచస్థాయి ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ అండ్ సొల్యుషన్స్ పరికరాలను తయారు చేయనున్నది.
ప్రపంచ ఆటోమేటెడ్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన దైఫుకు..భారత్‌లో తన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నూతన యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ యూనిట్‌తో స్థానిక యు వతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దైఫుకు ఇండియన్ సబ్సిడరీగా ‘వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నది.
దైఫుకు కంప్యూటర్ వివరాలు
ప్రధాన కార్యాలయం : ఒసాకా
ప్రెసిడెంట్, సీఈవో : హిరోషి జిషిరో
ప్రారంభం : 20, మే 1937(85 ఏండ్లు)
ఇండస్ట్రీ : యంత్రాలు
ఉద్యోగులు : 9,193(2018 వరకు)
ఆదాయం : 405 బిలియన్ జపాన్ కరెన్సీలు
అనుబంధ సంస్థలు : దైఫుకు ప్లస్మోర్, జెర్వీస్ బీ.వెబ్బ్ కంపెనీ, విన్రైట్, బీసీఎస్ గ్రూపు