జూబ్లీహిల్స్, జూలై 10: తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్స్‌లో భారీ తగ్గింపు ధరలతో సరికొత్త ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా కిలోల్లో షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందం పొందండంటూ అన్ని రకాల వస్ర్తాలపై 66 శాతం తగ్గింపు ధరలతో ‘ఆషాఢం నంబర్-1 కిలో సేల్’ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పించడంతో పాటు రూ.5 వేల వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నది. వినియోగదారుల అభిరుచి మేరకు కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి..
డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ శారీస్, క్యాటలాగ్ శారీస్, కిడ్స్ వేర్ వంటి వైవిధ్యభరితమైన వస్త్ర శ్రేణిని అందుబాటులో ఉంచారు. ఆషాఢం నంబర్-1 కిలో సేల్ ఆఫర్‌ను మరింత ఆకర్శణీయంగా తీర్చిదిద్దేందుకు వస్త్ర ప్రియుల కోసం సరికొత్త స్టాక్‌ను తెలుగు రాష్ర్టాల్లో ఉన్న షోరూమ్‌లలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆషాడ వేడుకల సందర్భంగా వస్ర్తాభిమానుల నుంచి ‘నభూతో..’ అన్న రీతిలో అనూహ్య స్పందన లభిస్తుందని.. మహిళా లోకం పెద్ద ఎత్తున షోరూమ్‌లకు తరలిరావడమే నిదర్శనమన్నారు.