హైదరాబాద్, నవంబర్ 21: ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అసెండియాన్..హైదరాబాద్లో ఏఐ స్టూడియోను ప్రారంభించింది. దేశంలో సంస్థ ఏర్పాటు చేసిన రెండో స్టూడియో ఇదే కావడం విశేషం. ఏఐ ఆవిష్కరణలు, వాస్తవ ప్రపంచ పరిష్కారాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్టూడియోలను నెలకొల్పినట్లు కంపెనీ సీఈవో కృష్ణమూర్తి తెలిపారు. భవిష్యత్తు వ్యాపారంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించనున్నదని, క్లయింట్లకు సేవలు అందించడానికి వీలుపడనున్నదన్నారు.
మంగోల్ రిఫైనరీకి మేఘా వెస్సెల్స్
హైదరాబాద్, నవంబర్ 21: మంగోలియా దేశంలో నిర్మిస్తున్న మంగోల్ గ్రీన్ ఫిల్డ్ రిఫైనరీకి అవసరమైన కీలక పరికరాలైన వెస్సెల్స్ ఎగుమతిని ప్రారంభించినట్లు మేఘా ఇంజినీరింగ్ ప్రకటించింది. గురువారం హైదరాబాద్లోని మెయిల్ వెస్సెల్ తయారీ విభాగంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.