హైదరాబాద్, అక్టోబర్ 7 : ప్రైవేట్ సేఫ్ డిపాజిట్ లాకర్ల సంస్థ ఆరమ్..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 24 గంటలు అందుబాటులో ఉండే టెక్ ఎనేబుల్ బ్యాంక్ లాకర్ సేవలను నగరంలో రెండు ప్రతిష్ఠాత్మకమైన కమ్యూనిటీలైన సత్య మాగ్నస్, అపర్ణ సరోవర్ గ్రాండ్లో ప్రారంభించినట్టు కంపెనీ సీఈవో విజయ్ అరిశెట్టి తెలిపారు.
2026 నాటికి 50 ప్రీమియం కమ్యూనిటీస్లు, 10 వేల లాకర్ల లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.