హైదరాబాద్, అక్టోబర్ 21: ఫార్మా, బయోటెక్నాలజీ కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థ ఆరాజెన్ లైఫ్ సైన్సెస్..హైదరాబాద్‌లో ఫార్ములేషన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. 3 మిలియన్ డాలర్లు (రూ. 25 కోట్లకు పైగా) పెట్టుబడితో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మల్లాపూర్ క్యాంపస్‌లో నెలకొల్పింది. క్లినికల్ తయారీ విభాగాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగానే నెలకొల్పిన ఈ యూనిట్లో వివిధ మోతాదుల్లో క్లినికల్ సైప్లెస్ తయారు చేస్తున్నట్టు కంపెనీ సీఈవో మన్ని కంటిపూడి తెలిపారు.
పలు ఫార్మా సంస్థలకు సంబంధించిన ఓరల్ సాలిడ్స్, లిక్విడ్స్, టాపికల్స్, అన్ని రకాల క్లినికల్ సైప్లెస్ ఈ యూనిట్లో తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సంస్థ ట్యాబ్లె ట్లు, క్యాప్స ల్స్, లిక్విడ్ ఫేస్ 1-3 పరిశోధనలను నిర్వహిస్తున్నది. ఈ యూనిట్‌కు ఇప్పటికే దేశీయ రెగ్యులేటరీ అథార్టీతోపాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో), డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పా రు. వెయ్యి నుంచి లక్ష డోస్‌లు సాలిడ్ ఓరల్స్, 100 లీటర్ల లిక్విడ్స్ తయారు చేసే సామర్థ్యం కలిగిన ఈ యూనిట్లో 60 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో క్లినికల్ ఉత్పత్తులకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. 2018లోనే సంస్థ ఇక్కడ ఆర్ అండ్ డీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.