Mac Mini M4 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. వచ్చేనెలలో ఐ-ఫోన్ 16 (iPhone 16) సిరీస్ ఫోన్లతోపాటు పలు ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. ‘మ్యాక్ మినీ (Mac Mini)’ పేరుతో బుల్లి కంప్యూటర్ కూడా ఆవిష్కరిస్తుందని సమాచారం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పవర్ తోపాటు ఎం4 చిప్ తో వస్తుందని తెలుస్తోంది. ఆపిల్ తయారు చేస్తున్న డెస్క్ టాప్ కంప్యూటర్లలో అత్యంత బుల్లి కంప్యూటర్ గా నిలుస్తుంది. 2010 నుంచి డిజైన్ మార్పుతో వస్తున్న తొలి కంప్యూటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతుగా నిలిచే ‘ఎం4 (M4 Chip)’ చిప్ వచ్చే అక్టోబర్ లో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తున్నది. ఆపిల్ టీవీ స్ట్రీమింగ్ డివైజ్ సైజును పోలి ఉంటుందీ ‘మ్యాక్ మినీ’ కంప్యూటర్. ఇది చిన్నా ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్ మినీ కంప్యూటర్ కంటే 1.4 అంగుళాల పొడవుగానే ఉంటుందని తెలుస్తోంది.
అల్యూమినియం షెల్ తో వస్తున్నది మ్యాక్ మినీ కంప్యూటర్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్ మినీ 599 డాలర్లు. కానీ, కొత్త వర్షన్ మ్యాక్ మినీ ధర తగ్గుతుందని భావిస్తున్నారు. స్మాలెస్ట్ మ్యాక్ మినీతోపాటు ఈ ఏడాది చివర్లో ఎం4 చిప్ పవర్డ్ ఐమ్యాక్స్, మ్యాక్ బుక్ ప్రోస్ ఆవిష్కరిస్తారని సమాచారం. శీతకాలంలో మ్యాక్ బుక్ ఎయిర్స్, వచ్చే ఏడాది మధ్యలో రీ వాంప్డ్ మ్యాక్ ప్రో, మ్యాక్ స్టూడియో మోడల్స్ ఆవిష్కరిస్తారని సమాచారం.