Apple iOS Update | ఐ-ఫోన్‌తోపాటు ఐపాడ్, ఆపిల్ వాచ్, ఆపిల్ మ్యాక్ బుక్ యూజర్ల కోసం ఆపిల్ కొత్తగా 17.0.2 ఐఓఎస్ వర్షన్ రిలీజ్ చేసింది. ఐఫోన్, ఐపాడ్, ఆపిల్ వాచ్, ఆపిల్ మ్యాక్ బుక్‌తోపాటు సఫారీ బ్రౌజర్లో భద్రతా లోపం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) ఇటీవల అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సెర్ట్-ఇన్ ‘అలర్ట్’ జాబితాలో ఐఓఎస్ 17.0.1 వర్షన్ కూడా ఉంది.
ఇప్పటి వరకూ ఐఫోన్లలో వాడుతున్న ఐఓఎస్‌లో 17.0.1 కూడా ఉండటంతో యూజర్లు తమ డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరితగతిన కొత్త ఓఎస్ అప్ డేట్ రిలీజ్ చేయాలని ఆపిల్‌ను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆపిల్ కొత్తగా 17.0.2 వర్షన్ ఐఓఎస్ రిలీజ్ చేసింది. తమ ఉత్పత్తుల యూజర్లు కొత్త ఓఎస్ వర్షన్ అప్ డేట్ చేసుకోవాలని ఆపిల్ కోరింది.
తాజా వర్షన్ 17.0.2 ఐఓఎస్ కోసం ఐఫోన్ సెట్టింగ్స్‌లో జనరల్ సెక్షన్ లోకి వెళ్లి సాఫ్ట్వేర్ అప్ డేట్ మీద క్లిక్ చేస్తే ఐఓఎస్ 17.0.2 వర్షన్ అప్ డేట్ అవుతుంది. ఇలాగే ఐపాడ్, ఆపిల్ మ్యాక్ బుక్, ఆపిల్ వాచ్, సఫారీ యూజర్లు కొత్త ఓఎస్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ, వెబ్ కిట్ కాంపొనెంట్లోని లోపాల వల్ల వాటి యూజర్లకు సైబర్ మోసగాళ్లు మాల్వేర్ లింక్స్, మెసేజ్‌లు పంపి వ్యక్తిగత డేటా తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్-ఇన్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.