Apple | న్యూఢిల్లీ, నవంబర్ 1: ఐఫోన్, ఐపాడ్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్‌కు భారతీయ మార్కెట్లోనూ కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా భారీగా ఆదాయం నమోదైంది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో రికార్డు స్థాయిలో 69.95 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఐఫోన్ సేల్స్ వాటా 43.8 బిలియన్ డాలర్లు.
సర్వీసెస్ సేల్స్ దాదాపు 12 శాతం పుంజుకొని 24.97 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐపాడ్ సేల్స్ 8 శాతం ఎగిసి 6.95 బిలియన్ డాలర్లను తాకినట్టు శుక్రవారం సంస్థ వర్గాలు తెలిపాయి.