చెన్నై, ఏప్రిల్ 25: అపోలో హాస్పిటల్స్ గ్రూపు.. దేశవ్యాప్తంగా మరో మూడు జన్యుశాస్త్ర ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. చెన్నైలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్‌ను మంగళవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు.
అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్‌కల్లా హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ఇనిస్టిట్యూట్లను తెరుస్తామన్నారు.