హైదరాబాద్, మే 31: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్..హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నది. రూ.2,200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ నూతన లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్ట్ను గోపన్పల్లి-గచ్చిబౌలిలో 22.28 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. దీంట్లో 2,088 అపార్ట్మెంట్లు ఉండనున్నాయని, వచ్చే మూడేండ్లలో ఈ ప్రాజెక్టు తొలి దశ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.
ఎయిర్ ఇండియా ‘పేడే సేల్’ ఆఫర్
న్యూఢిల్లీ, మే 31: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థయైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..ప్రత్యేకంగా ‘పేడే సేల్’ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లపై 25 శాతం వరకు డిస్కౌంట్ను కల్పిస్తున్నది. జూన్ 3 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. దేశవ్యాప్తంగా జూన్ 7 నుంచి సెప్టెంబర్ 20లోగా, అలాగే అంతర్జాతీయ రూట్లలో జూన్ 3 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రయాణించాల్సివుంటుంది.