హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్‌లో మరో అతిపెద్ద సూపర్ మార్కెట్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది నేషనల్ మార్ట్. 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ‘ఇండియా కా సూపర్‌మార్కెట్’ సంస్థకు ఇది ఆరో అతిపెద్ద స్టోర్ కావడం విశేషం. కుషాయిగూడ దగ్గర్లో నాగారం వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌తో 200కి పైగా ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగర్వాల్ తెలిపారు.
ఈ స్టోర్‌లో గృహోపకరణాలతోపాటు పర్సనల్ కేర్, స్టేషనరీ, దుస్తులు కూడా లభించనున్నాయి. కొనుగోలుదారులకు ఏడాదంతా తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆరు అతిపెద్ద అవుట్లెట్లను ఏర్పాటు చేసినట్లు.. ఈ ఏడాది చివరినాటికి మహబూబ్‌నగర్, నిజామాబాద్, అదిలాబాద్ల్లో స్టోర్లను ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు.