ముంబై, సెప్టెంబర్ 6: దేశీయ కార్ల మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ఫ్రాన్స్ అనుబంధంగా నడుస్తున్న ఆటో రంగ కంపెనీ సిట్రాయిన్ మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాసల్ట్ ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ఐదు రకాల్లో లభించనున్నది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.95 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.12.89 లక్షలు.
ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీతో వాహన ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ప్రీమియం అప్‌గ్రేడ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ మాడల్ క్రూజ్ కంట్రోల్, హాలో 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, టీపీఎంఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించారు.