చెన్నై, జూన్ 27: దేశీయ మార్కెట్లో సత్తాచాటడానికి సిట్రాయిన్ మరో మాడల్‌ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ నయా మాడల్ ఎయిర్‌క్రాస్ ప్రారంభ ధర రూ.9.09 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈకారు ప్లస్ ఎన్ఏ ఎంటీ మాడల్ ధర రూ.9.99 లక్షలు, ప్లస్ టర్బో 7ఎస్ ఎంటీ మాడల్ విలువ రూ.11.99 లక్షలకు విక్రయించనున్నది. ప్రీమియమ్ ఇంటీరియర్, నూతన టెక్నాలజీ ఫీచర్లు, రివర్స్ కెమెరా, సాఫ్ట్ టచ్ ఐపీ, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు వంటి ఫీచర్లుతో తీర్చిదిద్దినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ నూతన కారుకోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల వద్ద బుకింగ్‌లు ప్రారంభించినట్టు, బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి డెలివరీ చేయనున్నట్టు తెలిపింది.