శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 06, 2020 , 00:17:00

ఆంధ్రా బ్యాంక్‌ లాభం రూ.175 కోట్లు

ఆంధ్రా బ్యాంక్‌ లాభం రూ.175 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఆంధ్రా బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.174.76 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే వ్యవధిలో రూ.573.52 కోట్ల నష్టాలను చవిచూసింది. కాగా, ఆదాయం ఈసారి రూ.5,913.14 కోట్లుగా ఉంటే.. పోయినసారి రూ.5,609.43 కోట్లుగా ఉందని బుధవారం బ్యాంక్‌ రెగ్యులేటరీలకు తెలియజేసింది. స్టాండలోన్‌ ఆధారంగా రూ.162.80 కోట్ల నికర లాభాన్ని పొందింది. నిరుడు ఇది రూ.578.59 కోట్ల నష్టంగా  ఉన్నది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 17.26 శాతం పెరుగగా, ఎన్‌ఎన్‌పీఏ 6.36 శాతానికి తగ్గాయి. మొండి బకాయిల (ఎన్‌పీలు) కోసం కేటాయింపులు కూడా రూ.1,028.07 కోట్లకు దిగాయి. నిరుడు అక్టోబర్‌-డిసెంబర్‌లో రూ. 1,790.17 కోట్లుగా ఉన్నాయి. 


logo