న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏఎంవో ఎలక్ట్రిక్ బైకు..తాజాగా మరో మోడల్‌ను పరిచయం చేసింది. జాంటి ప్లస్ స్కూటర్ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 60వీ/40 ఏహెచ్ లిథియం బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జ్‌తో 120 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. దొంగతనాల నుంచి రక్షణ కల్పించే అలారం, ఇతర ఫీచర్స్ సైడ్ స్టాండ్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డీఆర్ఎల్ లైటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న 140 డీలర్ల వద్ద ఈ నెల 15 నుంచి లభించనున్నదని తెలిపింది.