Amazon Prime | మీరు ఓటీటీలో సినిమాలు, ఇతర కార్యక్రమాలు వీక్షించేందుకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అది మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబోతున్నది. ఇక కొత్తగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకనే వారు ఇప్పుడు ఉన్న సభ్యత్వం చార్జీపై అదనంగా 50 శాతం చెల్లించాలి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రూ.999 కాగా.. దీన్ని రూ.1499 చేస్తున్నట్లు ఆ సంస్థ గతంలోనే ప్రకటించింది. ఈ ధరలు మంగళవారం (డిసెంబర్ 14) అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మూడు రకాలుగా తీసుకోవచ్చు. నెలవారీగా, త్రైమాసికం వారీగా, వార్షిక సభ్యత్వాలు తీసుకునే వెసులుబాటు ఉంది. వార్షిక సభ్యత్వ చార్జీ మాదిరిగానే నెలవారీ, త్రైమాసికం చార్జీలు పెరుగుతాయి. నెలవారీ సభ్యత్వం రూ.129 నుంచి రూ.179కి, త్రైమాసిక సభ్యత్వం రూ.329 నుంచి రూ.459కి పెంచుతారు.
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారికి ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు రెండ్రోజుల్లోపు ఉచిత హోం డెలివరీ తదితర వసతులు లభిస్తాయి. 2016లో భారత్‌లో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ప్రారంభమైంది. నాడు వార్షిక సభ్యత్వ చార్జీ రూ.499 కాగా, 2019లో రూ.999కి పెంచేసింది.