Amazon : ఈ ఏడాది పలువురు సీనియర్ ఉద్యోగులకు మూల వేతనంలో ఎలాంటి పెంపు చేపట్టరాదని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్ణయం తీసుకుందని సమాచారం. గత ఏడాదిగా అమెజాన్ షేర్ ధరలు రికార్డుస్ధాయిలో 75 శాతం పైగా పెరిగాయి. ఉద్యోగుల వేతనంలో వాటాల పాత్ర కీలక కావడంతో షేర్ ధరల పెరుగుదల అధిక ఎర్నింగ్స్కు దారితీసింది. షేర్ ధరల పెరుగుదలతో ఉద్యోగుల మొత్తం వేతనం భారీగా పెరిగింది. దీంతో సీనియర్ ఉద్యోగుల మూల వేతనాన్ని ఈ ఏడాది పెంచరాదని మేనేజర్లకు అమెజాన్ స్పష్టం చేసిందని సమాచారం.
గత ఏడాది కాలంగా అమెజాన్ షేర్ ధర పెరగడంతో పలువురు ఉద్యోగుల మొత్తం వేతనం ముందుగా అనుకున్న దాని కంటే భారీగా పెరుగుతున్నదని అమెజాన్ ప్రతినిధి వివరించారు. దీంతో అమెజాన్ ప్రధానంగా స్టాక్ ఆప్షన్ల కంటే వేతనంపై ఆధారపడిన ఉద్యోగులకు మాత్రమే నగదు రూపంలో వేతన ప్రయోజనాలను అందించడంపై దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, ఈ ఏడాది జనవరిలో, అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ (RTO) పాలసీని పాటించడంలో విఫలమైన ఉద్యోగులకు తక్కువ రేటింగ్లను కేటాయించమని మేనేజర్లను కోరినట్లు తెలిసింది.
కార్యాలయ హాజరు ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వారికి ప్రమోషన్లను నిరోధించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం ఇలా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై అమెజాన్ ప్రతినిధి స్పందించారు. ప్రమోషన్లకు సంబంధించి తాము ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతూ పదోన్నతులను ప్రకటించేముందు ఉద్యోగులు కంపెనీ మార్గదర్శకాలు, విధానాలను అనుసరించారనేది కూడా చూస్తామని చెప్పారు.
Read More
RC16 | బుచ్చిబాబు సర్ప్రైజ్ అప్డేట్.. రాంచరణ్ ఆర్సీ16 నుంచి స్టన్నింగ్ న్యూస్