Amazon Great Indian Festival Finale Days | మరో వారం రోజుల్లో దీపావళి పండుగ రాబోతున్నది. భారతీయులంతా దీపావళి సందర్భంగా తమకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం అంతా టెక్నాలజీ.. స్మార్ట్ ఫోన్ల మయం.. కనుక తమకు నచ్చిన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో కస్టమర్లకు తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించింది. గత నెల ఏడో తేదీన ప్రారంభమైన ఆఫర్లు ముగింపు దశకు చేరుకున్నాయి. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు తదితర ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నది. ఆపిల్, వన్ ప్లస్ ఐక్యూ, రియల్ మీ తదితర స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
ఈ ఆఫర్లతోపాటు అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసినా, ఈఎంఐ ఆప్షన్లతో కొన్నా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఐదు శాతం క్యాష్ బ్యాక్, ఐదు శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు పది శాతం.., గరిష్టంగా రూ.5000 వరకూ డిస్కౌంట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ రూ.6500 వరకూ, వన్ కార్డ్ క్రెడిట్ కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ రూ.8,250 వరకూ రాయితీ పొందొచ్చు. దీపావళి ముంగిట అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్ లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలపై ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది.
ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ రూ.27,999 నుంచి రూ.24,999లకు, ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.69,700 నుంచి రూ.50,749లకు, వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ రూ.28,999లకు లభిస్తుంది.
ఫోన్ —– —– —— — —- ఎంఆర్పీ —– డిస్కౌంట్ ధర
ఐక్యూ జడ్7 ప్రో 5జీ — — రూ. 27,999 — రూ. 24,999
రియల్మీ నార్జో 60ఎక్స్ 5జీ – రూ. 18,999 — రూ.12,999
రెడ్మీ12 5జీ — —– —– రూ.17,999 — రూ.13,499
ఐ-ఫోన్ 13 —– —— — రూ. 69,900 — రూ. 50,749
రెడ్మీ12 సీ —- — — — రూ. 13,999 — రూ. 6,799
రియల్మీ నార్జో ఎన్53 —- రూ.10,999 — రూ. 7,999
రియల్ మీ నార్జో 60 5జీ — – రూ.19,999 — రూ.14,999
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ —- రూ. 28,999 — రూ. 26,499