న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా. .కిరాణ సరుకులకోసం ప్రారంభించిన అమెజాన్ ఫ్రెష్ సేవలను మరో 270 నగరాలకు విస్తరించనున్నట్టు ప్రకటించింది.
గడిచిన రెండేండ్లలో అమెజాన్ ఫ్రెష్ సేవలు 4.5 రెట్ల వృద్ధిని సాధించిందని, కిరాణా సామాన్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటున్నవారు అధికమయ్యారని అమెజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ తెలిపారు.