హైదరాబాద్, జూన్ 20: నార్వేకు చెందిన ఇనోబ్యాట్ ఏఎస్లో వాటాను మరింత పెంచుకున్నది అమర రాజా ఎనర్జీ అండ్ మొబలిటీ సంస్థ. కొత్తగా 4.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి 20 మిలియన్ల యూరోల (రూ.180 కోట్లకు పైమాటే) పెట్టుబడి పెట్టింది. దీంతో సంస్థలో అమర రాజా వాటా 9.32 శాతానికి చేరుకున్నది. గతంలో 10 మిలియన్ యూరోల పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.