హైదరాబాద్, మే 20: ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.98.85 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.189.38 కోట్ల లాభంతో పోలిస్తే 47.80 శాతం తగ్గింది.
అయినప్పటికీ కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3.72 శాతం అధికమై రూ.2,180.96 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 50 పైసలు తుది డివిడెండ్‌ను ప్రకటించింది. గత మధ్యంతర డివిడెండ్ రూ.4కు ఇది అదనం.