టాటా సూపర్ యాప్
పారిశ్రామిక దిగ్గజం టాటా ఓ సూపర్ యాప్‌ను తీసుకువచ్చింది. ఆన్లైన్ షాపింగ్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చేలా ‘నీయూ’ పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి యాప్‌లకు గట్టి పోటీనిచ్చే ఈ యాప్‌ను గురువారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ‘ఇది నీయూ రోజు.
- ‘నీయూ’ పేరుతో ప్రారంభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: పారిశ్రామిక దిగ్గజం టాటా ఓ సూపర్ యాప్‌ను తీసుకువచ్చింది. ఆన్లైన్ షాపింగ్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చేలా ‘నీయూ’ పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి యాప్‌లకు గట్టి పోటీనిచ్చే ఈ యాప్‌ను గురువారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ‘ఇది నీయూ రోజు. టాటా కుటుంబం నుంచి కొత్త సభ్యుడు టాటా నీయూను టాటా డిజిటల్ మీ ముందు ఉంచింది’ అంటూ లింక్డెన్ పోస్ట్‌లో చంద్రశేఖరన్ రాశారు.
తమ విశ్వసనీయమైన బ్రాండ్లు ఎయిర్ ఏషియా, బిగ్ బాస్కట్, క్రోమా, ఇండియన్ హోటల్స్, క్యూమిన్, స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా క్లిక్, టాటా ప్లే, వెస్ట్సైడ్లు ఇప్పటికే టాటా నీయూలో ఉన్నాయని, త్వరలో విస్తారా, ఎయిర్ ఇండియా, టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్ వచ్చి చేరతాయని ఆయన వివరించారు. కిరాణా-హోటల్ బుకింగ్, విమానయాన టికెట్ల బుకింగ్, ఔషధాలు తదితరాలన్నింటికీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు ఈ యాప్‌ను ఉద్దేశించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ సిద్ధంగా ఉన్నది. యూజర్లు బిగ్ బాస్కెట్, 1ఎంజీ తదితర యాప్స్‌ను కలిగిఉంటే వాటిని ఆన్ఇన్స్టాల్ చేసి, సూపర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని టాటా ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ata Neu
- tata super app
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

