Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు జరుపాలంటే బ్యాంక్ శాఖలకు వెళ్లాల్సిందే. అయితే.. ఆదివారంతో మొదలయ్యే వారంలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), క్రిస్మస్ డే (డిసెంబర్ 25)తోపాటు మరికొన్ని పర్వదినాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఆర్బీఐ హాలీడే క్యాలండర్ ప్రకారం జనవరి నెలలో మొత్తం 16 సెలవులున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు పని చేయవు. వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక వేడుకల సందర్భంగా ఆయా రోజుల్లో బ్యాంకు ఉద్యోగులకు సెలవులు వస్తాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. ఆ సెలవుల లిస్ట్ చూద్దాం..