హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికులు విదేశాల నుంచి తీసుకొచ్చే విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చార్జీల్లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఐ పాడ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విలువ రూ.50 వేలు దాటితే ఇకపై 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా సిగరెట్ ప్యాకెట్లపై 100 స్టిక్స్ కంటే తక్కువ ఉంటే సుంకం లేదని.. అంతకుమించితే 110 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే లిక్కర్, ఆల్కహాల్, వైన్లకు 2 లీటర్ల వరకు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదని, కానీ అంతకు మించి ఉంటే 165 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అన్ని సైజుల టీవీలపైనా 38.5 శాతం, 1,000 గ్రాముల కంటే అధిక బరువు కలిగిన బంగారు ఆభరణాలపై 44 శాతం చెల్లించాలి.