న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కార్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుండటంతో ఈ పరిశ్రమ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం రూ.2,500 కోట్ల స్థాయిలో ఉన్న దేశీయ ఎయిర్‌బ్యాగ్‌ల పరిశ్రమ..2026-27 నాటికి రూ.7 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. ఒక్కో ఎయిర్‌బ్యాగ్‌ను తయారు చేయడానికి ప్రస్తుతం రూ.3000 నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుండగా..నూతన మార్గదర్శకాలకు లోబడి తయారు చేస్తే అయ్యే ఖర్చు రెండు రెట్లు పెరిగి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు చేరుకుంటుందని ఇక్రా అంచనావేస్తున్నది. ప్రస్తుతం సరాసరిగా కార్లలో మూడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండగా, వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి వీటి సంఖ్య ఆరుకి చేరుకోనున్నాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు.