హైదరాబాద్, మే 31: మెజెల్లానిక్ క్లౌడ్.. వ్యవసాయ, లాజిస్టిక్స్ రంగాల కోసం డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం వీటిని హైదరాబాద్ ఆఫీస్లో ఆవిష్కరించింది. దేశీయంగా తయారైన ఈ డ్రోన్లను మానవ సాయం లేకుండానే ఆపరేట్ చేసుకోవచ్చని సంస్థ తెలియజేసింది.
లాజిస్టిక్స్ డ్రోన్లు 5 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల శ్రేణిలో పనిచేయనున్నాయి. వీటి సరకు రవాణా సామర్థ్యం 2 కిలోల నుంచి 100 కిలోల వరకున్నది. ఇక వివిధ పరిమాణాల్లో అగ్రీ స్ప్రెయింగ్ డ్రోన్లను తెచ్చారు.