హైదరాబాద్, జూలై 29 : లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎజిలెంట్..హైదరాబాద్‌లో నూతన బయోఫార్మా సెంటర్‌ను నెలకొల్పింది. ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో మెక్‌డొనెల్ మాట్లాడుతూ…భారత్‌లో వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ బయోఫార్మా సెంటర్‌ను నెలకొల్పినట్టు, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టం వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు.