Venue Special Knight Edition | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లో తన సబ్-4 మీటర్ ఎస్యూవీ వెన్యూ స్పెషల్ నైట్ ఎడిషన్ (Venue Special Knight Edition) ఆవిష్కరించింది. వెన్యూ స్పెషల్ ఎడిషన్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధీని ధర రూ.10 లక్షల నుంచి రూ.13.48 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. క్రెటా, అల్కాజర్ తర్వాత హ్యుండాయ్ విడుదల చేసిన మూడో నైట్ ఎడిషన్ వెన్యూ (Venue Special Knight Edition) కావడం ఆసక్తికర పరిణామం.
హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ స్పందిస్తూ.. ‘కొత్త కార్ల కొనుగోలుదారుల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇస్తూ వెన్యూ నైట్ ఎడిషన్ మోడల్ మార్కెట్లోకి తెచ్చినందుకు గర్వ పడుతున్నాం. నూతన అనుభవాలతో ఉద్వేగభరితమైన స్ఫూర్తిని అంది పుచ్చుకుంటాం. కొత్త కార్ల కొనుగోలుపై వివేచనతో ఆలోచించే వైవిధ్యభరితమైన కస్టమర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని వెన్యూ నైట్ ఎడిషన్ (Venue Special Knight Edition) కారును స్పోర్టీగా డెవలప్ చేశాం. క్రెటా నైట్ ఎడిషన్ విజయం సాధించిన స్ఫూర్తితో.. ఇప్పటికే పాపులర్ ఎస్‌యూవీగా నిలిచిన మా కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చాం. హ్యుండాయ్ ఎస్యూవీ లైఫ్‌తో కస్టమర్లకు థ్రిల్ లభిస్తుందని మేం విశ్వాసంతో ఉన్నాం’ అని తెలిపారు.
ఆల్-బ్లాక్ థీమ్ విత్ బ్రాస్ కలర్డ్ ఇన్సర్ట్స్తో వెన్యూ నైట్ ఎడిషన్ (Venue Special Knight Edition) వస్తుంది. ఇదే థీమ్‌తో సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కామ్ డాష్ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, 3డీ డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి ఫీచర్లు అదనం. ఫోర్ మోనోటోన్ అండ్ వన్ డ్యుయల్ టోన్ కలర్ -అబ్యేస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫెరీ రెడ్, ఫెరీ రెడ్ విత్ అబ్యేస్ బ్లాక్ లో వెన్యూ నైట్ ఎడిషన్ వస్తుంది.
బ్లాక్ కలర్ థీమ్‌తో వెన్యూ నైట్ ఎడిషన్ (Venue Special Knight Edition) వస్తోంది. ఫ్రంట్ గ్రిల్లె, షార్క్-ఫిన్ ఆంటీనా, ఔట్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, స్కిడ్ ప్లేట్స్, హ్యుండాయ్ లోగో తదితరాలు బ్లాక్ కలర్లో డిజైన్ చేశారు. వేరియంట్‌ను బట్టి అల్లాయ్ వీల్స్, వీల్ కవర్స్ కూడా బ్లాక్‌లోనే ఉంటాయి.
ఫ్రంట్ అండ్ రేర్ బంపర్, ఫ్రంట్ వీల్స్, రూఫ్ రైల్స్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కారుకు స్పోర్టీ లుక్ తెచ్చేందుకు బ్రేక్ కాలిపర్స్ రెడ్ కలర్ లోనూ, డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లో రూపుదిద్దుకుంటాయి. రేర్ హ్యుండాయ్ లోగో, వెన్యూ ఎంబ్లం డార్క్ క్రోమ్‌లో అమరుస్తారు.