Viacom18-Star India | వయాకాం-వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్..!
Viacom18-Star India | రిలయన్స్ అనుబంధ వినోద రంగ సంస్థ వయాకాం 18, వాల్ట్ డిస్ట్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది.
Viacom18-Star India | రిలయన్స్ అనుబంధ వినోద రంగ సంస్థ వయాకాం 18, వాల్ట్ డిస్ట్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రెండు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ కానున్నది.
‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు. ఏ పక్షం కూడా వ్యతిరేకించలేదు’ అని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తన ఆదేశాల్లో పేర్కొంది. వాల్ట్ డిస్నీ, స్టార్ ఇండియా విలీనం ఆరు నెలల క్రితమే రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం విలీన సంస్థలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలకు 63.16 శాతం, మిగతా 36.84 శాతం వాటా వాల్ట్ డిస్నీకి ఉంటుంది.
వాల్ట్ డిస్నీ- వయాకాం జాయింట్ వెంచర్ పరిధిలో 120 టీవీ చానెళ్లతోపాటు రెండు స్ట్రీమింగ్ సర్వీసులు నడుస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్ కంపెనీలో రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. వినోద రంగంలో సోనీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థలకు రిలయన్స్ వయాకాం-వాల్ట్ డిస్నీ జాయింట్ వెంచర్ కంపెనీ గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్ పర్సన్‌గా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు.
ఇవి కూడా చదవండి :
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

