Bharat Pe | ఆశ్నీర్ గ్రోవర్ తర్వాత నథానీ వంతు.. భారత్ పే నుంచి ఔట్!
Bharat Pe | భారత్‌పేలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు సాగుతున్నాయి. తాజాగా మరో ఫౌండర్ సత్యం నథానీ వైదొలిగారు.
Bharat Pe | డిజిటల్ పేమెంట్స్ సంస్థ భారత్‌పేలో నిష్క్రమణ కొనసాగుతున్నది. ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేయగా.. తాజాగా సంస్థ మరో వ్యవస్థాపకుడు వైదొలిగారు. వివాదాస్పద నిర్ణయాలతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భారత్ పే ఫౌండర్లలో ఒకరైన అశ్నీర్ గ్రోవర్ అర్ధంతరంగా సంస్థ బోర్డు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫౌండర్ సత్యం నథానీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నథానీ నిష్క్రమణ ప్రక్రియ కొనసాగుతున్నది. నథానీ రాజీనామా చేసిన సంగతిని భారత్‌పే ధృవీకరించింది. ఎంటర్పెన్యూర్ లక్ష్యాల సాధన కోసం సత్యం నథానీ వైదొలుగుతున్నారని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.
భారత్‌పేలో టెక్నాలజీ అనుసంధానం, భారత్‌పేలో యుటిలిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మైనారిటీ వాటాను కొనుగోలు చేయడంలో సత్యం నాధానీ కీలకంగా వ్యవహరించారు. కాగా, భారత్ పేలో టెక్నాలజీ భారత్ పే చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ నిషిత్ శర్మ, ఇన్స్టిట్యూషనల్ డెట్ హెడ్ చంద్రిమా ధర్ తదితరులు వ్యక్తిగత కారణాల రీత్యా గత నెలలో వైదొలిగారు. సుపరిపాలన వైఫల్యాలకు పాల్పడినట్లు థర్డ్ పార్టీ అడిటింగ్లో నిగ్గుతేలడంతో అశ్నీర్ గ్రోవర్.. గత మార్చిలో అన్ని బాధ్యతల నుంచి వైదొలిగారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

