ముంబై, సెప్టెంబర్ 3 : పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆదిత్యా బిర్లా గ్రూపు తాజాగా వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రూ.1,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు.
అల్ట్రాటెక్ సిమెంట్ విభాగంలో పనిచేయనున్న ఈ కేబుల్స్ అల్ట్రావోల్ట్ పేరుతో విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. గత నాలుగేండ్లలో మూడో అతిపెద్ద వ్యాపారం ఇదే కావడం విశేషం.