Gautam Adani | అదానీ గ్రూప్ (Adani Group) చైర్మన్ గౌతం అదానీ (Gautam Adani) తన వారసులకు గ్రూప్ బాధ్యతల అప్పగింతకు రంగం సిద్ధం చేశారు. 62 ఏండ్ల గౌతం అదానీ తన 70వ ఏటా రిటైర్ కానున్నట్లు ప్రకటించారు. భారత్ లో రెండో అతిపెద్ద కుబేరుడైన గౌతం అదానీ 2030 నాటికి తమ వారసులకు అదానీ గ్రూప్ బాధ్యతలు అప్పగిస్తానని బ్లూంబర్గ్ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కుటుంబ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. తన ఇద్దరు కుమారులు కరణ్, జీత్లతోపాటు సోదరుల కొడుకులు ప్రణవ్, సాగర్ లకు ఆ కుటుంబ ట్రస్టులో సమాన వాటాలు కల్పించనున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 213 బిలియన్ డాలర్లు.
గౌతం అదానీ తన సోదరులు వినోద్, రాజేశ్ లతో కలిసి కమొడిటీ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. అటుపై తన వ్యాపార సామ్రాజ్యాన్ని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, ఇంధన, మీడియా రంగాల్లోకి విస్తరించారు. వినోద్ కుమారుడు ప్రణవ్, రాజేశ్ తనయుడు సాగర్లతోపాటు తన ఇద్దరు కుమారులు కరణ్, జీత్లకు సమాన వాటాలు కల్పిస్తూ వారసత్వ బాధ్యతలు అప్పగించనున్నారు. ‘మా వారసులు నలుగురు అదానీ గ్రూప్ వారసత్వాన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లి, మరింత వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని గౌతం అదానీ చెప్పారు. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో ప్రణవ్ అదానీ, కరణ్ అదానీ, సాగర్ అదానీ, జీత్ అదానీ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వినోద్ అదానీ తనయుడు ప్రణబ్ అదానీ.. అదానీ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్గా అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలు ఆగ్రో, ఆయిల్ అండ్ గ్యాస్ ల్లో డైరెక్టర్ గా ఉన్నారు. 1999లో అదానీ విల్మార్ సంస్థ ప్రారంభం నుంచి దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ వంటనూనెల మార్కెట్లో అదానీ విల్మార్ కు 20 శాతానికి పైగా వాటా ఉంది. అదానీ అగ్రి లాజిస్టిక్స్, అదానీ అగ్రి ఫ్రెష్ అనే సంస్థలను నిర్వహిస్తున్నారు.
గౌతం అదానీ తనయుడు కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీగా పని చేస్తున్నారు. రాజేశ్ అదానీ కొడుకు సాగర్ అదానీ.. గ్రూప్ సంస్థల అనుబంధ ఎనర్జీ బిజినెస్ అండ్ ఫైనాన్స్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. గౌతం అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ విమానాశ్రయాల వ్యాపార బాధ్యతల్లో ఉన్నారు.
Google Pixel 9 | పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లపై గూగుల్ ఆకర్షణీయ ఆఫర్లు.. ఇవీ డీటెయిల్స్..?!
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !