న్యూఢిల్లీ, ఆగస్టు 21: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్లు గౌతమ్ అదానీ కుటుంబం వాటా పెంచుకున్నది. సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపిన సమాచారం ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.65 శాతం నుంచి 69.87 శాతానికి పెరిగింది.
అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన సిమెంట్ తయారీ సంస్థ సంఘీ ఇండస్ట్రీస్‌లో 26 శాతం కోసం ఈ ఓపెన్ ఆఫర్‌ను జారీ చేసింది.