e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home బిజినెస్ భాగ్యనగరంలో కీలూప్‌

భాగ్యనగరంలో కీలూప్‌

  • 220కిపైగా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బ్రిటన్‌ సంస్థ
  • ఇక ఆటోమోటివ్‌ పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీ సొల్యూషన్స్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: ఆటోమోటివ్‌ పరిశ్రమకు టెక్నాలజీ సొల్యూషన్స్‌ను అందించే కీలూప్‌ సంస్థ.. హైదరాబాద్‌లో తమ నూతన గ్లోబల్‌ డెలివరీ హబ్‌ను ప్రారంభించింది. మైండ్‌స్పేస్‌ ఐటీ పార్క్‌లో ఏర్పాటైన ఈ హబ్‌లో 220కిపైగా ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఇతర హబ్‌ల ఉద్యోగులతో అనుసంధానమై ఇక్కడి ఉద్యోగులు పనిచేస్తారని ఈ బ్రిటన్‌కు చెందిన కంపెనీ వెల్లడించింది. కీలూప్‌ ప్రధాన సేవలైన రోడ్‌మ్యాప్స్‌, రిసెర్చ్‌, డెవలప్‌మెంట్‌పై హైదరాబాద్‌ హబ్‌ దృష్టి పెడుతుంది. ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ వంటి సర్వీసుల్లోనూ కస్టమర్లకు ఇక్కడి ఉద్యోగులు సాయం చేయనున్నారు. కాగా, ఇప్పటిదాకా ఉన్న కీలూప్‌ ఆఫీసుల్లో నవ తరాన్ని ప్రతిబింబిస్తున్న హైదరాబాద్‌ కార్యాలయం.. లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ (లీడ్‌)లో అత్యధిక స్థాయి ప్లాటినమ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టాండర్డ్‌ను, ప్రజారోగ్య హితమైన వెల్‌బీయింగ్‌ సర్టిఫికేషన్‌ (వెల్‌)కు అనుగుణంగా ఉంటుందని సంస్థ యాజమాన్యం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఇదిలావుంటే పోలండ్‌లోని వార్సాలో తర్వాతి హబ్‌ ఉంటుందన్న కీలూప్‌.. హైదరాబాద్‌ హబ్‌ ఏర్పాటులో బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్‌ బినా సింగ్‌ కృషి ఉన్నదని వివరించింది. స్థానిక కీలూప్‌ ఉద్యోగులు, ప్రాజెక్ట్‌ డెలివరీ బృందంతో కలిసి డీటీ స్టూడియో వ్యవస్థాపక డైరెక్టర్‌ కూడా అయిన సింగ్‌.. హబ్‌ నిర్మాణంలో తోడ్పాటునందించారని చెప్పింది. ‘కీలూప్‌ హై-టెక్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌కు తగ్గట్లుగా హైదరాబాద్‌ హబ్‌ను తీర్చిదిద్దాం’ అని బినా సింగ్‌ తెలిపారు.

- Advertisement -

సాంకేతిక నైపుణ్యానికి అంతర్జాతీయ కేంద్రంగా నేడు హైదరాబాద్‌ వర్ధిల్లుతున్నది. ఇక్కడ ప్రతిభకు కొదవే లేదు. ప్రపంచ శ్రేణి టెక్నాలజీ ఇంజినీర్‌గా సంస్థకు కావాల్సిన అన్ని వనరులు హైదరాబాద్‌లో పుష్కలంగా ఉన్నాయి. మా కస్టమర్లకు సంతృప్తికరమైన సేవల్ని ఇక్కడి నుంచి అందించగలమన్న విశ్వాసం మాకున్నది.
-టామ్‌ కిల్రో, కీలూప్‌ సీఈవో

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మా ఈ కార్యాలయం.. నూతన ప్రామాణికతకు అద్దం పడుతుంది. ఓ సమర్థవంతమైన టెక్నాలజీ కంపెనీకి నిలువెత్తు నిదర్శనం. కొనుగోలు దగ్గర్నుంచి వాహనానికి సంబంధించిన అన్ని విషయాల్లో సహచరులు, కస్టమర్లకు కొత్తదనాన్ని చూపుతాం. ముఖ్యంగా సరికొత్త డిజైన్లు, కాన్సెప్ట్‌ల విషయంలో మా భారతీయ కస్టమర్ల అభిరుచికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతాం.
-క్లాస్‌ ట్రిల్లింగ్స్‌గార్డ్‌, కీలూప్‌ గ్లోబల్‌ డెలివరీ ఉపాధ్యక్షుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement