ముంబై, సెప్టెంబర్ 17: డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల 1 నుంచి కార్డు టోకనైజేషన్ నిబంధనల్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. గడిచిన కొన్నేండ్లలో చాలామంది సైబర్ మోసాలకు గురైన విషయం తెలిసిందే. దీనికి కారణం వ్యాపారుల వెబ్‌సైట్‌పై వినియోగదారుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల సమాచారం అలాగే ఉండిపోవడమే. ఈ క్రమంలోనే కార్డుల టోకనైజేషన్ తప్పనిసరి అన్న నిబంధనను ఆర్బీఐ తెస్తున్నది. ఇందులో 16 అంకెల కార్డు నంబర్, పేర్లు, గడువు తేదీలు, కోడ్స్ వంటి సమాచారాన్ని యూనిక్ ఆల్టర్నేట్ కార్డు నంబర్ లేదా టోకన్తో రీప్లేస్ చేస్తారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి రానున్నది.
సమస్య ఇదీ..
ప్రస్తుతం ఏదైనా లావాదేవీ సమయంలో వ్యాపారులు వినియోగదారుల బ్యాంక్ కార్డు సమాచారాన్ని తమతమ కంప్యూటర్ వెబ్సైట్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. అయితే సదరు వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికావడమో లేక మరే ఇతర కారణాల చేతనో ఈ సమాచారం బయటకు పొక్కుతున్నది. దీంతో కస్టమర్లు నష్టపోవాల్సి వస్తున్నది. కాబట్టి కస్టమర్ల ప్రయోజనార్థం, వారి క్రెడిట్ కార్డు సమాచారం రక్షణ నిమిత్తం ఆర్బీఐ ఈ టోకనైజేషన్ ప్రమాణాలను ఆచరణలో పెడుతున్నదని నిపుణులు సైతం చెప్తున్నారు.
టోకనైజేషన్‌తో..
టోకనైజేషన్ నిబంధనలతో రిటైలర్ల వెబ్‌సైట్‌కు బదులు కస్టమర్లందరి సమాచారం బ్యాంకుల వద్దే నిక్షిప్తం అవుతుంది. అలాగే పదేపదే కార్డు వివరాలను ఎంటర్ చేసే తలనొప్పీ కస్టమర్లకు తప్పుతుంది. ఈ టోకనైజేషన్ సర్వీసును పొందడానికి ఎవరికీ, ఎటువంటి చెల్లింపులనూ జరపనవసరం లేదు.
కార్డుల టోకనైజేషన్ ఇలా..