పుణె, జనవరి 9: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి ఎనిమిది కొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
వీటిలో ఎలక్ట్రిక్ మాడళ్లతోపాటు పలు లగ్జరీ మాడళ్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన సంవత్సరంలో సంస్థ రికార్డు స్థాయి 19,565 యూనిట్ల వాహనాలను విక్రయించింది.