హైదరాబాద్, జూన్ 7: టెక్నాలజీ సంస్థ ఆన్‌ప్యాసివ్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వలసలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ టెక్నాలజీ సేవల సంస్థ.. హైదరాబాద్‌లో ఉన్న ఆఫీస్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోబోతున్నది. జావా, డాటా సైన్స్, మాన్యువల్ టెస్టింగ్, బిగ్ డాటా, సెక్యూరిటీ టెస్టింగ్, టెక్నికల్ ఆర్కిటెక్, కంటెంట్ రైటర్ విభాగాల్లో అనుభవం ఉన్న బీఈ/బీ.టెక్/ఎం.టెక్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ సీఈవో ఆషా ముఫరే సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆఫీస్‌లో 300కి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యని 1,000కి పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కోర్సులు చేసిన అభ్యర్థులు తమ సీవీలను కంపెనీ వెబ్సైట్ recruitment@onpassive.comకి పంపాలని సూచించారు.