హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్(ఒమెగా హాస్పిటల్స్) తొలిసారిగా భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. ఫండ్ మేనేజ్డ్ మోర్గాన్ స్టాన్లీ నుంచి రూ.500 కోట్ల నిధులు సేకరించినట్లు బుధవారం వెల్లడించింది. మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి, ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఒమెగా హాస్పిటల్స్ ఎండీ మోహన్ వంశీ తెలిపారు.