హైదరాబాద్, నవంబర్ 13: రాష్ర్టానికి చెందిన ప్రముఖ గ్రానైట్ ఉత్పత్తి సంస్థ పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్(పీఈఎస్‌ఎల్)..భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మేకగూడ వద్ద ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు అడ్వాన్స్డ్ యూనిట్‌ను నెలకొల్పడానికి రూ.440 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఐఖ్య ‘ఈ5వరల్డ్’
హైదరాబాద్, నవంబర్ 13: నాన్-బ్యాంకింగ్ సేవల సంస్థ ఐకేఎఫ్ ఫైనాన్స్‌కు చెందిన ఐఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్..హైదరాబాద్‌లో తాజాగా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతల పెట్టిన రిసార్ట్ ైస్టెల్ లివింగ్ తరహాలో ‘ఈ5వరల్డ్’ కోసం రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.