న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్ బైకును పరిచయం చేసింది. 2025 ఏడాదికిగాను సంస్థ విడుదల చేసిన ఆర్15 మాడల్‌ను మళ్లీ అధునీకరించి విడుదల చేసింది. ఈ ఆర్15 బైకు ప్రారంభ ధర రూ.1.67 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.2.01 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఆర్15 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ బైకు ఆర్15ఎం, ఆర్15 వెర్షన్ 4, ఆర్15ఎస్ రకాల్లో లభించనున్నది. 155 సీసీ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ తయారైన ఈ బైకును అడ్వాన్స్ ఫీచర్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కలిగివున్నాయి.