Tata Altroz Facelift | ముంబై, మే 22 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ సరికొత్త మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాడల్ అల్ట్రోజ్‌ను సరికొత్తగా డిజైన్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. గరిష్ఠంగా రూ.11.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు నూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
1.2 లీటర్ల 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో తయారు చేసింది. వచ్చే నెల 2న బుకింగ్‌లు ఆరంభించనున్న సంస్థ..అదే నెల చివరి నుంచి బుకింగ్ చేసుకున్న కస్టమర్‌కు అందచేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహన విక్రయాలు సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నట్టు చెప్పారు.