MG Astor SUV | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తొలిసారిగా ఆస్టర్ యూఎస్వీని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం విశేషం. ఏఐ టెక్నాలజీ ఉన్న తొలి ఎస్యూవీ ఇదే కావడం విశేషం. ఈ ఎస్యూవీ దాదాపు రూ.10లక్షలు (ఎక్స్‌షోరూం) ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ యూఎస్‌వీకి ‘బ్లాక్‌బస్టర్ ఎస్యూవీ’గా పేరు పెట్టింది. ఈ వెర్షన్లో వాహనం ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. తద్వారా మరిన్ని ప్రీమియం ఫీచర్లను సరసమైన ధరకు అందుబాటులో ఉండొచ్చు. ఈ సారి కంపెనీ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించింది. ఇప్పుడు ఎంజీ ఆస్టర్ 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నది.
ఈ ఇంజిన్ 109 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, లేదంటే.. 8 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనున్నది. 2025 ఆస్టర్ రూ.13 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ప్రారంభ ధరకు పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే ఏకైక ఎస్యూవీ అని ఎంజీ పేర్కొంది. ఇది షైన్ వేరియంట్లో అందుబాటులో ఉంది. దాంతో పాటు ఇప్పుడు సెలెక్ట్ వేరియంట్‌కు ఆరు ఎయిర్‌బ్యాగులు, ఐవరీ లెదర్ సీట్లతో రానుంది. ఇది మరింత సురక్షితంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ ఎస్‌యూవీకి అనేక ప్రీమియం, అధునాతన ఫీచర్లు జోడించింది. ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటివి డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి.
దాంతో పాటు ఇది కొత్త ఐ స్మార్ట్ 2.0 సిస్టమ్‌తో వస్తుంది. ఇది అధునాతన వినియోగదారు ఇంటర్ఫేస్, 80 కంటే ఎక్కువ కనెక్డ్ ఫీచర్స్‌తో వస్తుంది. స్పెషల్ ఫీచర్లలో జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో రానుంది. డిజిటల్ కీ యాక్టివిటీతో కలిపిన యాంటీ-థెఫ్ట్ ఫీచర్ నెట్వర్క్ కనెక్షన్ లేకుండానే సేఫ్టీని అందిస్తుంది. అలాగే, ఇది వెదర్, క్రికెట్ అప్డేట్స్, కాలిక్యులేటర్, సమయం, తేదీ, రోజువారీ సమాచారం, రాశిఫలాలు, డిక్షనరీ, వార్తలు, నాలెడ్జ్ కోసం వాయిస్ కమాండ్స్ సైతం అందిస్తుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ రాకేశ్ సేన్ మాట్లాడుతూ.. ఎంజీ ఆస్టర్ ప్రస్తుతం కొత్త విశ్వాసంతో మార్కెట్లోకి వచ్చిందన్నారు. కేవలం కారు మాత్రమే కాకుండా గొప్ప డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి సరైన ఎస్యూవీ అని తెలిపారు. ఎంజీ మోటార్ ఇండియా వందకుపైగా దేశాల్లో ఉనికిలో ఉండగా.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్‌ని 2023లో స్థాపించారు.